కో ఆప్షన్ సభ్యులకు ఘన సన్మానం

Wed,June 12, 2019 12:08 AM

కల్లూరు, జూన్ 11 : మండలపరిధిలోని కప్పలబంధం గ్రామంలో మంగళవారం సర్పంచ్ నందిగం ప్రసాద్ ఆధ్వర్యంలో కోఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన మండలపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఎస్‌కే.ఇస్మాయిల్, ఎస్‌కే. కమ్లీని వారు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి కో ఆప్షన్ సభ్యులుగా నియమించినందుకు సభ్యులకు, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపి, కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు లక్కినేని కృష్ణ, ఉపసర్పంచ్ మందపాటి మాధవ రెడ్డి, నరసింహారెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు, సుభాని, ్ణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

230
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles