క్రీడల్లో రాణిస్తున్న అంబేద్కర్‌నగర్ యువకుడు

Wed,June 12, 2019 12:08 AM

తల్లాడ, జూన్11: మండల పరిధి అంబేద్కర్‌నగర్‌కు చెందిన జొన్నలగడ్డ సునీల్ జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నాడు. సునీల్ అండర్-15 విభాగంలో జాతీయ స్థాయిలో 6వ ఫెడరేషన్ నేషనల్ స్పీడ్ బాల్‌కప్‌లో పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించాడు. జిల్లా స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడల్లో 100 మీటర్ల పరుగుపందెంలో ప్రథమస్థానం సాధించాడు. 32 జిల్లాల స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తృతీయ స్థానాన్ని సాధించాడు. చదువుతో పాటు, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సునీల్ చదువుతో పాటు, క్రీడల్లో రాణించడం పట్ల గురుకులాల డైరెక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అభినందించారు. భవిష్యత్‌లో జాతీయస్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని సునీల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రీడాకారుడిని గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్‌బాబు, గ్రామపెద్దలు అభినందించారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles