ఐక్యంగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేయండి..

Wed,June 12, 2019 12:08 AM

-ప్రజాప్రతినిధులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దమ్మపేట, జూన్11: : స్థానిక ఎన్నికల్లో విజయ సాధించి ప్రజాప్రతి నిధులుగా ప్రజాక్షేత్రంలో అడుగు వేసిన ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారంలో సమక్యతతో ముందుసాగి ప్రజలతో మమేకం అయినప్పుడే గుర్తుంటాని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో మంగళవారం గత స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలుస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా పనిజేసే ప్రతిఒక్కరికి సమస్యలు తప్పవని, వాటిని దాటుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులైన ప్రతిఒక్కరికీ అందజేయడంతో పాటు మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని సూచించారు. తుమ్మలను కలసిన వారిలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్‌ఎంపీపీ దారా మల్లికార్జురావు, రాష్ట్ర పామాయిల్ రైతుసంఘం బాధ్యులు ఆలపాటి రామచంద్రప్రసాద్, మండల రైతుసమన్వయ సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ కేదాసి వెంకట సత్యనారాయణ(కేవి),ఎల్లిన రాఘవరావు, కోటగిరి బుజ్జిబాబు, కోటగిరి సత్యంబాబు, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, ఎరగొర్ల రాధాకృష్ట, పైడి సాయికుమార్, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్ ఉన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles