సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

Thu,June 13, 2019 01:34 AM

పెనుబల్లి:సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో ముందుకు వెళతానని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని కుప్పెనకుంట్లలో స్థానిక ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్రం లోనే సింగరేణి కార్మికుల కోసం ఆ సంస్థ రూ.500కోట్లు మంజూరు చేస్తే, నియోజకవర్గానికి రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు విన్నవించగా వెంటనే ఆ సంస్థ సీఎండీతో మాట్లాడి రూ.150 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని, నిధుల విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ నిధులను కార్మికుల క్వార్టర్ల నిర్మాణం కొరకు, కార్మికుల కుటుంబాల అభివృద్ధి కొరకు వెచ్చించడం జరుగుతుందన్నారు. అలాగే గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖామంత్రిగా ఉన్నప్పుడు సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.35కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఆ నిధుల వినియోగానికి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రిని కోరగా మున్సిపల్ కమిషనర్, తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారం, పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందన్నారు. సింగరేణి మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా నియో జకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ నిధులు మంజూరు చేసిన కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు, పెనుబల్లి మండలాల్లో పట్టా పాసు పుస్తకాలు పెండింగులో ఎక్కువగా ఉ న్నాయని ముఖ్యమంత్రికి తెల్పడంతో,కలెక్టర్‌తో మాట్లాడి భూ సమస్యలు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

240
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles