వేంకటేశ్వర స్వామి సేవలు తెలంగాణ రాష్ట్రంలో కూడాఉండాలి..

Thu,June 13, 2019 01:35 AM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరుగా మూడు సార్లు పనిచేసే అదృష్టం తనకు దక్కిందని ఇంత వరకు మూడు సార్లు సభ్యునిగా ఎన్నికైన వారు ఎవరూ లేరని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. టీటీడీ నిధుల్లో దేవాలయాల నిర్మాణా లకు తన పదవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించానని, రూ.6 లక్షలు, రూ.8లక్షలు, రూ.10లక్షలు ఇలా ఒక్కొక్క దేవాలయానికి వెచ్చించడం జరిగిందని, అలాగే నియోజకవర్గవ్యాప్తంగా 40 భజన మండపాలను నిర్మించడం జరిగిందన్నారు. అలాంటి అవకాశం ఆ భగవంతుడు తనకు కల్పించారని, భద్రా చలం దేవాలయానికి అదనపు గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు మంజూరుకు కూడా కృషి చేయడం జరిగిందని, బర్స్ ఆస్పత్రిలో రాష్ట్రవ్యాప్తంగా 1500 మందికి మెకాళ్ల ఆపరేషన్లు చేయించడం జరిగిందన్నారు. గతంలో మాదిరిగా రెండు రాష్ర్టాల్లో వేంకటేశ్వరస్వామి సేవలు కొనసాగించే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. తిరుమల, తిరుపతి దేవస్థానం సేవలు చేయడం అదృష్టం గా భావించి ఆ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లు మామిడి మైసయ్య, ఆళ్ళ అప్పారావు, ఎంపీటీసీలు నారుమళ్ళ లక్ష్మీబాబు, కనగాల సురేష్‌బాబు, వెంకటకృష్ణ, మాజీ ఎంపీపీ చెక్కిలాల విజయ, నాయకులు కనగాల వెంకటరావు, లక్కినేని వినీల్, చీకటి రామారావు, ముక్కెర భూపాల్ రెడ్డి, ఆవిటి మారేశ్వరరావు, చింతనిప్పు సత్య నారాయణ, కొప్పుల రంగారావు, కొత్తగుండ్ల అప్పారావు, వంగా గిరిజాపతి, వేముల కృష్ణయ్య, కోమటి ప్రసాద్, గాయం రాజు, వర్ధిబోయిన నాగేశ్వరరావు, విపిరిశెట్టి రాము తదితరులున్నారు.

249
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles