ఎమ్మెల్యే అజయ్‌ని కలిసిన టాస్క్ సీఈఓ

Thu,June 13, 2019 01:35 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా బుధవారం ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్‌ను వీడీఒస్ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలోని విద్యార్థులను నైపుణ్యవంతులుగా తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో మరిన్ని కోర్సులు విద్యార్థులలకు అందించాలని, ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టిసారిస్తున్నట్లు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు. టాస్క్ ద్వారా రాష్ట్రంలోని ఇజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ,పీజీ, ఫార్మసీ, పాలటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులక నైపుణ్యాలకు పదును పెడుతుందని భవిష్యత్తులో కార్పొరేట్ కొలువులు విద్యార్థుల ముంగిట వాలేలా ప్రయత్నాలు చేస్తుందన్నారు. వ్యక్తిగత నైపుణ్యాలు, సంస్థాగత నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పై తాజా పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ టాస్క్‌ల్లో నమోదైన విద్యా సంస్థల్లో విద్యార్థులకు దశల వారీగా శిక్షణ ఉంటుందని ఆయన ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టాస్క్ సెంటర్ ఇన్‌చార్జ్ అశోక్ ఉన్నారు.

240
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles