సంక్షేమ పథకాల ప్రదాత సీఎం కేసీఆర్

Thu,June 13, 2019 01:35 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : బడుగు బలహీన వర్గాల మేలు కోరేది టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, దాంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎంపీగా తాను పనిచేసినప్పుడు సిఫార్సు చేసిన 126 మంది లబ్ధిదారులకు రూ. 43.34 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరయ్యాయి. సదరు లబ్ధిదారులకు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, నూతన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ.. ము ఖ్యంగా ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అభయ హస్తాన్ని అందిస్తూ వారి కుటుంబంలో ఆనందాన్ని నింపుతున్న టీఆర్ ఎస్ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. దాంతో పాటు రైతాంగానికి పెద్దపీట వేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కుతుందని, ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు అందుకే మరోసారి పట్టం కట్టారన్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నా యక్ మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారని కొనియాడారు.

ముఖ్యంగా తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ మర్యాదపూర్వకంగా పలకరించడంతోపాటు, వారి కి కడుపునించా భోజనం పెట్టి మరీ వారికి చేతనైన సాయం చేసే పొంగులేటి ప్రజల దీవెనలతో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆ కాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకూ సముచిత న్యాయం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యంగా ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆపన్నహస్తం అందించి, ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. మధిర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 9.26 లక్షలు, సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 8.61 లక్షలు, ఖమ్మం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 7.70 లక్షలు, వైరా నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 7.55 లక్షల, పాలేరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 5.80లక్షలు, అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 2.32 లక్షలు, కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 96 వేలు, ఇల్లందు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 77,500లు, నల్గొండకు చెందిన లబ్ధిదారులకు రూ. 60 వేలు, మిర్యాలగూడెంకు చెందిన లబ్ధిదారునికి రూ. 24, 500లు నిధులు మంజూరయ్యాయి. తమ తరుపున సిఫార్సు చేసి నిధులు మంజూరు చేయించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సదరు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టా దయానంద్, బొర్రా రాజశేఖర్, వెంకటేశ్వరరెడ్డి, నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, జడ్పీటీసీలు సామినేని హరిప్రసాద్, నంబూ రి కనకదుర్గ, వరప్రసాద్, డేరంగుల బ్రహ్మం, నాయకులు మలిరెడ్డి మురళిరెడ్డి, మీగడ శ్రీను, దేవరపల్లి అనంతరెడ్డి, ఎర్ర వెంకన్న, పోట్ల ప్రసాద్, సూతకాని జైపాల్, రాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

221
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles