సమన్వయంతో పనిచేయండి

Thu,June 13, 2019 01:38 AM

-ఎమ్మెల్యే అజయ్‌కుమార్
జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లి బిడ్డలకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వ యంతో పని చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 9వ తేదీన ఓ సె క్యూరిటీ గార్డు వైద్యుడిగా అవతారం ఎత్తిన ఘటన పై వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా ఆసుపత్రి సందర్శన నిమిత్తం పలు వార్డులను కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, గతంలో రెండుసార్లు కాయకల్ప అవార్డు స్వచ్ఛభారత్ ద్వారా మరో అవార్డును ఈ ఆసుపత్రి దక్కించుకుందని, అదే స్పూర్తితో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో వైద్యశాల అభివృద్ధిలో భాగంగా ట్రామాకేర్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించుకోనున్నామని, భవిష్యత్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 150 పడకల ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలున్నాయని, చిన్న చిన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలోఈ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా సిబ్బంది మధ్య పొరపొచ్చాలు, అభిప్రాయ బేధాలు వీడి రోగులకు మెరుగైన వైద్యసేవలందించి జిల్లా వైద్యశాల ప్రతిష్టను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోగులు, గర్భిణులు అధికశాతం ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని ఈ తరుణంలో ఎలాంటి సమస్యలు ఉత్పనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిదేనని అన్నారు. జిల్లా కలెక్టర్, జడ్పీచైర్మన్, తాను కూడా వైద్యశాల కమిటీకి సభ్యుడినేనని జిల్లా ఆసుపత్రి అభివృద్ది కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సీటిస్కాన్ సమస్యను త్వరలో అధిగమిస్తామన్నారు. గర్భిణులకు మొదటి కాన్పును సాధారణ ప్రసవం జరిగేలా ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటే ఆ మహిళకు రెండవ కాన్పు కూడా సాధారణ ప్రసవం జరిగేలా అవకాశం ఉం టుందని, తద్వారా ఎలాంటి అనారోగ్య స మస్యలు ఆమెకు తలెత్తవని ఆయన అ న్నారు. సాధారణ ప్రసవాలలో రాష్ట్రంలో నే ఖమ్మం జిల్లా ఆసుపత్రి ప్రథమ స్థా నంలో ఉండటం సంతోషదాయకమని, అదే స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యు లు, న ర్సింగ్ సిబ్బంది పని చేసి ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. వైద్యులు, సిబ్బంది వైద్యసేవలు అందించ డంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలోతాను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతిబాయి, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామునాయక్, ఆర్‌ఎంవో డాక్టర్ కృపా ఉషశ్రీ, కార్పొరేటర్ పగడాల నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు బుర్రి వినయ్, హెచ్చు ప్రసాద్ పాల్గొన్నారు.

307
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles