సదరం శిబిరానికి విశేష స్పందన

Fri,June 14, 2019 01:59 AM

మయూరిసెంటర్, జూన్ 13: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జరిగిన సదరం శిబిరానికి విశేషస్పందన లభించింది. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో గల దివ్యాంగులకు జిల్లా వైద్యశాలలో దివ్యాంగశాఖ ధ్రువీకరణ పత్రాలకు చెందిన పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం జరిగిన సదరం శిబిరానికి 212 మంది దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మెడికల్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రామునాయక్ మాట్లాడుతూ అంగవైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థులను అంగవైకల్య పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని అంగవైకల్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి గురువారం జిల్లా వైద్యశాలలో జరిగే సదరం శిబిరానికి అనేక మంది దివ్యాంగులు ఒక్కసారే తండోపతండాలుగా రావడంతో వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భావించి ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో గల అంగవైకల్యం కలిగిన వారు మాత్రమే శిబిరానికి హాజరుకావడంతో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అంగవైకల్య పరీక్షలు నిర్వహించి పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ (ఎముకలు, కీళ్లు) విభాగానికి చెందిన దివ్యాంగులు 169 మంది, కంటి చూపు తక్కువగా ఉన్నవారు 43 మందిని పరీక్షించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్ కృపా ఉషశ్రీ, వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్థోపెడిక్), ఫిజియోథెరఫీ వైద్యురాలు స్వాతి, డీఆర్‌డీఏ విభాగ ఏపీడీ జయశ్రీ, డీపీఎం పద్మ, ఏపీఎం లక్ష్మణ్, సిబ్బంది నాగూల్‌మీరా, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

225
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles