17నుంచి గ్రామీణ తపాలా ఉద్యోగుల నియామకాలు

Fri,June 14, 2019 02:00 AM

మయూరిసెంటర్, జూన్ 13 : ఉమ్మడి ఖమ్మం జిల్లా డివిజన్ పరిధిలో 38గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు, నియామక ఉత్తర్వుల జారీ ప్రక్రియ ఈ నెల 17నుంచి ప్రారంభించనున్నట్లు ఖమ్మం డివిజన్ తపాలా అధికారి ఫణిప్రసాద్ తెలిపారు. గురువారం ఖమ్మంలోని ప్రధాన తపాల కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. 38ఖాళీలకు గాను ఉభయ జిల్లాలకు చెందిన 13,849 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 17నుంచి జులై 18వరకుదరఖాస్తుల పరిశీలన, అర్హుల గుర్తింపు, వెంటనే నియామకం చేపడతామన్నారు.

ఈ ప్రక్రియ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న ఉప్పలగూడెం, అంజుబాక, 18న ఆనందాపురం, జగ్గారం, 19న మొండికుంట, తుమ్మలచెర్వు, ఎల్చిరెడ్డిపల్లి, 20నరామానుజవరం, సమితి సింగారం 21న కల్లివేరు, కుదునూరు, 24న పెద్దపల్లి, చింతూరు. 25న ధర్మవరం, కృష్ణాపురం, 26న బుచ్చిరెడ్డిపాలెం, చిన్న బీరవెల్లి, 27న గార్లపాడు, సిరిపురం, 28న గిడ్డవారి గూడెం, బాసిత్ నగర్, జూలై 2న చంద్రుతండా, 3న జాలిముడి, కేశవాపురం, 5న మల్లుపల్లి, 9న పంగిడి, 10న లింగన్న పాలెం, 12న సాలె బంజర, 15న బచ్చివారిగూడెం, ఒట్లపల్లి, 16న అనంతారం, గణేష్ ఉన్నిపాడు, 17న గంగదేవునిపాడు, బేత్లపాడు, 18న భద్రుతండా గ్రామీణ తపాల ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులు తేదీల వారిగా పరిశీలించి అర్హులకు తపాల ద్వారా సమాచారం ఇస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎవరూ తపాల కార్యాలయానికి రావాల్సి అవసరం లేదని, తాము నియామక ఉత్తర్వులు అందించిన తరువాతే రావాలని ఫణిప్రసాద్ స్పష్టం చేశారు.

282
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles