వడదెబ్బతో ఎలక్ట్రీషియన్ మృతి

Sat,June 15, 2019 12:41 AM

రఘునాథపాలెం, జూన్ 14: వడదెబ్బ తగిలి వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఖమ్మం నగరం వేణుగోపాలనగర్‌లో చోటుచేసుకుంది. ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ కథనం ప్రకారం.. వేణుగోపాలనగర్‌కు చెందిన పశుల రమేష్ (50) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా రమేష్ ఖానాపురం వద్ద కళ్లు తిరిగి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. అతడి కుమారుడు పశుల సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ తెలిపారు.

234
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles