దాడి ఘటనలో భార్యాభర్తలపై కేసు నమోదు

Sat,June 15, 2019 12:42 AM

రఘునాథపాలెం, జూన్ 14: దాడి ఘటనలో భార్యాభర్తలపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ సాయిరమణ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిర తరణి శ్రావణి అనే మహిళ ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తోంది. కాగా శుక్రవారం ఎస్‌ఆర్ గార్డెన్‌లో పెళ్లి జరుగుతున్న క్రమంలో దాడ్డా వినయ్ అనే వ్యక్తి టీ స్టాల్‌కు ఎదురుగా షోడా బండిని నిలిపాడు. అలా ఎందుకు నిలిపావని ప్రశ్నించిన శ్రావణిపై వినయ్, అతని భార్య అమృత దాడి చేసి గాయపరిచారు. దీనిపై శ్రావణి అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles