భక్తరామదాసు కళాక్షేత్రంలో రేపు కర్ణధారి

Sat,June 15, 2019 12:42 AM

ఖమ్మం కల్చరల్, జూన్ 14: అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల నెలా.. వెన్నెల సాంస్కృతిక కదంబంలో భాగంగా ఈనెల 16న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కర్ణధారి నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్‌రావు, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కళాకారులు ప్రదర్శించే ఈ పౌరాణిక పద్య నాటకాన్ని అధిక సంఖ్యలో జిల్లా ప్రజలు తిలకించాలని వారు కోరారు. వైభవం కోల్పోతున్న పద్య నాటకానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ ఆధ్వర్యంలో ఈ నాటకాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ నాటక ప్రదర్శనతో పాటు అభ్యుదయ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాట, కళాకారులకు సత్కారాలు చేయనున్నట్లు తెలిపారు.

219
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles