పకడ్బందీగా కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Sat,June 15, 2019 12:42 AM

ఖమ్మం క్రైం, జూన్ 14: పోలీస్ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రవపత్రాల పరిశీలన కార్యక్రమం పకడ్బందీగా జరుగుతున్నదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఇటీవల నిర్వహించిన పోలీస్ ఉద్యోగాల తుది రాత పరీక్షల్లో అర్హులైన అభ్యర్థులకు సంబంధించిన ధ్రవ పత్రాల పరిశీలన ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలోని సీఆర్‌పీఎఫ్ బేరాక్స్‌లో జరుగుతోంది. ఈ పరిశీలనను శుక్రవారం సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం 8,274 మంది అభ్యర్థులకు రోజుకు 800ల నుంచి 1200ల మంది అభ్యర్థుల చొప్పున ధ్రువ పత్రాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 22 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. దృవీకరణ పత్రాల పరిశీలన అడిషనల్ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో మినిస్ట్రీయల్ స్టాప్ నిర్వహిస్తుందని సీపీ తెలిపారు.

పోలీస్‌శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటాలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నిఘా వ్యవస్థ పర్యవేక్షణలో జరగాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా సంబంధిత అధికారి ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరుగుతుందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ శ్యామ్‌సుందర్, ఏవో జానకిరామ్, సూపరింటెండెంట్ హనిఫ్, సత్యావతి, రెహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.

239
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles