బడీడు పిల్లల్ని స్కూల్‌కు పంపండి

Sat,June 15, 2019 12:42 AM

రఘునాథపాలెం, జూన్14: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడీడుకి వచ్చిన పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి మధన్‌మోహన్ ఉపాద్యాయులకు సూచించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు శేఖర్, ప్రేమ్‌చంద్‌లు నోటు పుస్తకాలను వితరణగా అందజేశారు. దీనికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని నగర పాలక కమిషనర్ డాక్టర్ పాపాలాల్‌తో కలిసి విద్యార్ధులకు అందజేశారు. అంతేకాక పాఠశాలకు రూ.70వేలతో నూతనంగా గేటును నిర్మించిన దాత అనంత్ కుమార్‌ను డీఈవో, మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కూరాకుల వలరాజు, ఎస్‌ఎంసీ చైర్మన్ షేక్ షైనాభీ, బత్తుల లక్ష్మీ, షేక్ దస్తగిరి, హెచ్‌ఎం, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

237
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles