ప్రైవేట్ వద్దు.. సర్కార్ విద్యే భేష్..

Sat,June 15, 2019 12:42 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, జూన్ 14 : ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని డీఈవో మదన్‌మోహన్ అన్నారు. శుక్రవారం రూరల్ మండలంలోని జలగంనగర్ హైస్కూల్‌లో బడిబాట ర్యాలీని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 924 పాఠశాలలో బడిబాట ర్యాలీలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను వివరిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో పాఠాలు బోధిస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, వెనుబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ, పౌష్టికరమైన భోజనం తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్య బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆలోచనచేసి ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పి ల్లలను జాయిన్ చేయించాలన్నారు. అనంతరం పదిలో 9.7గ్రేడ్ సాధించిన విద్యార్థిని దుర్గాదేవిని షీల్డ్‌తో డీఈవో మధన్‌మోహన్, డీఆర్‌డీఏ పీడీ ఇం దుమతిలు బ హుకరించారు. కార్యక్రమం లో ఎంఈవో నాగేశ్వరరావు, హెచ్‌ఎం అజిత, పీఎస్ హెచ్‌ం నాగమణి, ఉపాధ్యాయులు ఉన్నారు.

269
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles