వైద్యశాల ఎదుట మృత శిశువుతో ఆందోళన

Sat,June 15, 2019 12:43 AM

మయూరిసెంటర్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదుట మృతశిశువుతో బంధువులు అందోళనకు దిగారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం మృతశిశువుకు చెందిన బంధువులు ఆందోళన చేశారు. ఈసందర్భంగా మృతశిశువు తండ్రి అనిల్ మాట్లాడుతూ.. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటకు చెందిన తన భార్య రమాదేవిని ఈనెల 11న మొదటి కాన్పుకోసం జిల్లా ఆసుపత్రికి తన తీసుకొచ్చానని, నర్సింగ్ సిబ్బంది ఈనెల 12వరకు వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించారని ఆయన ఆరోపించారు. 12వ తేదీ రాత్రి 7.30 గంటలకు శస్త్ర చికిత్స నిర్వహించగా బాబు జన్మించాడని, అప్పటి నుంచే శ్వాస కోశ, ఫిట్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని సిబ్బంది వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు సిఫార్సు చేశారు. తాము అక్కడి వెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ శిశువు శుక్రవారం మృతి చెందిందన్నారు. దీనికి ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందే ప్రధాన కారణమని ఆయన రోపించారు. 12వ తేదీ ఉదయం నుంచి 10 గంటల పాటు సాధారణ ప్రసవం కోసం శస్త్ర చికిత్స నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో టూటౌన్ పోలీసులు వైద్యశాల వద్దకు చేరుకొని ఆందోళనను విరమింపుజేశారు. ఆర్‌ఎంవో డాక్టర్ కృపాఉషశ్రీ అక్కడకు చేరుకొని సంఘటనకు కారణమైన వారిని విచారించి, చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

289
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles