ఇద్దరు కోర్టు ఉద్యోగుల సస్పెన్షన్‌

Sun,June 16, 2019 01:15 AM

ఖమ్మం లీగల్‌:విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఇద్దరు కోర్టు ఉద్యోగులు డీ లక్ష్మీనారాయణ, జాకోబ్‌లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. 2019, మే 10న చింతకాని పోలీసులు బెయిలబుల్‌ అఫెన్సులపై మొత్తం 16మందిని అదుపులోకి తీసుకుని, అదేరోజు సాయంత్రం ఖమ్మం మూడవ అదనపు ప్రథమశ్రేణి కోర్టుకు తీసుకువచ్చారు. సదరు కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి అయిన మొదటి అదనపు ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ఎన్‌ అనితారెడ్డి ఎదుట రాత్రి 7గంటలకు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో న్యాయమూర్తి ఇంట్లో ఉండటంతో అక్కడే నిందితులను ప్రవేశపెట్టారు. నిందితుల తరపున ష్యూరిటీలు సిద్ధం చేసుకుని వచ్చిన న్యాయవాది కన్నెబోయిన నాగేశ్వరరావును రిమాండ్‌ సమ యంలో న్యాయమూర్తి దగ్గరకు వెళ్లకుండాస్టెనో లక్ష్మీనారాయణ, అటెండర్‌ జాకోబ్‌ అడ్డుకున్నారు.న్యాయవాదిని లోపలికి అనుమతించవద్దని న్యాయమూర్తి చెప్పినట్లు వారు తెలిపారు.

అనంతరం రూ.10వేలతోపాటు ఇద్దరు ష్యూరిటీలు రాసినట్లుగా చెప్పారు. ష్యూరిటీలు సిద్ధంగా ఉన్నట్లు న్యాయమూర్తికి తెలియచేయాల్సిందిగా న్యాయవాది ప్రాదేయపడ్డాడు. ఆ విషయం కూడా న్యాయమూర్తితో చెప్పామని, సోమవారం ష్యూరిటీలు పెట్టుకోవాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం మొత్తం 16మంది నిందితులను ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. శుక్రవారం రాత్రి జరిగిన విషయాన్ని శనివారం ఉదయం న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా ష్యూరిటీలు సిద్ధంగా లేవని స్టెనో చెప్పాడని అనడంతో న్యాయవాది ఆశ్చర్యపో యాడు. జమానతులు సిద్ధంగా ఉన్న విషయం న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లకుండా, నిందితుల రిమాండ్‌ సమయంలో తనను లోనికి అనుమతించక పోవడంతో ఆవేదనకు గురైన న్యాయవాది జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశాడు.

306
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles