ప్రభుత్వ దవాఖానాలో కేంద్ర బృందం

Sun,June 16, 2019 01:16 AM

మయూరి సెంటర్‌, జూన్‌ 15: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అందిస్తున్న వైద్యసేవల అంశంపై కేంద్ర బృందం నీతిఅయోగం డాక్టర్‌ మస్తాఫా ఆఫ్జల్‌ పర్యవేక్షించారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జిల్లా కేంద్రంలోని మథర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ వైద్యశాలలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నిషన్‌, నాల్గొవ తరగతి ఉద్యోగులను పిలిపించి వైద్యసేవలు అందుతున్న తీరు, వారికి కేటాయించి విభాగాలలోని విధుల గురించి, సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఏఫ్రాన్‌ ధరించకుండా రావడం పలు అంశాలను ఆయన గ్రహించి దిశానిర్థేశం చేశారు. జిల్లా వైద్యశాలలో హైద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ప్రైవేట్‌ వైద్యశాలల స్థాయిలో ప్రభుత్వం పేద రోగులకు వైద్యసేలందించేందుకు రూ. కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలు, నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో టెక్నాలజీతో కూడిన యంత్రాలు, వాటి ద్వారా శిశువులకు అందుతున్న వైద్యసేవలకు చెందిన రికార్డులను పరీక్షించి సేవలు అద్భుతంగా ఉన్నాయని, తల్లికిబిడ్డకు ప్రాణాపాయం లేకుండా వారి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది, వైద్యవిభాగ సూచలు తూచా తప్పకుండా పాటిస్తూ ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.

వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది గర్భిణీల పట్ల, బాలింతలకు అందించే వైద్యసేల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆయన అన్నారు. 2017 ఏప్రిల్‌ నుంచి మార్చి 2018 వరకు జిల్లా కేంద్రంలోని రోగులకు అందిన వైద్యసేవలు, ఎస్‌ఎన్‌సీయూ, పీఐసీయూ, ఎన్‌ఆర్‌సీ విభాగాలు, శస్త్రచికిత్సలు, ఇతర సేవల గురించి రికార్డులు క్షుణ్ణంగా ఉన్న నేపథ్యంలో ఆయన మెడికల్‌ సూపరిటెండెంట్‌, ప్రభుత్వ వైద్యులను, సిబ్బందిని అభినందించారు. ఖమ్మం జిల్లా వైద్యశాలల రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు నీతి అయోగ్‌ బృందం డాక్టర్‌ ముస్తాఫా ఆఫ్జల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయ అధికారి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ కృపా ఉషశ్రీ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సుగుణ, క్వాలిటీ మేనేజర్‌, హెడ్‌ నర్సులు, స్టాప్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

293
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles