‘నీట్‌' స్టేట్‌ ర్యాంకుల్లోనూ ‘శ్రీచైతన్య’ సత్తా

Sun,June 16, 2019 01:16 AM

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జూన్‌ 15: నీట్‌-2019 స్టేట్‌ ర్యాంకుల్లోనూ ఖమ్మం శ్రీచైతన్య కళాశాల సత్తా చాటింది. నీట్‌ ఫలితాలను ఈ నెల 6న ఎన్‌టీఏ విడుదల చేయగా.. రాష్ట్రస్థాయి ర్యాంకులను వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ శనివారం వెల్లడించింది. రాష్ట్రస్థాయిలో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ఎల్‌.మమత 28వ ర్యాంకు, ఆర్‌.కావ్య 29వ ర్యాంకు సాధించి కళాశాల ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పారు. వెయ్యిలోపు 7 ర్యాంకులను కూడా ఈ కళాశాల సొంతం చేసుకుంది. ఎం.హిమబిందు 129 ర్యాంకు, బీ.చామంతి 131 ర్యాంకు, డీ.ప్రియాంక 176వ ర్యాంకు, బీ.నిఖిత 178వ ర్యాంకు, బీ.శశాంక్‌ 181వ ర్యాంకు, ఏ.సంకీర్తన 559వ ర్యాంకు, ఎండీ ముజామ్మిల్‌ 1030వ ర్యాంకు సాధించారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ మల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎం.సాయిగీతిక, డీజీఎం అండ్‌ డీన్‌ జీ.సత్యనారాయణ, అకడమిక్‌ డీన్‌ వర్మ, ఏజీఎంలు సీహెచ్‌ బ్రహ్మం, జీ.ప్రకాష్‌, జీ.గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు అభినందించారు.

267
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles