బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ జామితా విడుదల

Sun,June 16, 2019 01:16 AM

బాసర :గ్రామీణ పేద విద్యార్థుల కలల యూనివర్సిటీ అయిన బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరం ప్రవేశాల జాబితాను శనివారం కళాశాలలో వీసీ అశోక్‌కుమార్‌ విడుదల చేశారు. మొత్తం 1500 సీట్లకు గానూ 34,217 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ జాబితాను యూనివర్సిటీ వెబ్‌ www.admissions.rgukt. ac.in లో పొందుపర్చి విద్యార్థులకు కూడా సమాచారం అందజేశారు. శనివారం 1404 సీట్ల జాబితాను విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లను స్పోర్ట్స్‌, పీహెచ్‌, ఎన్‌సీసీ కాప్‌లకు త్వరలోనే జాబితా విడుదల చేస్తామని వీసీ తెలిపారు. ఎక్కువగా బాలికలు 68 శాతం (960), బాలురు 32 శాతం (444) సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థులకు మొదటి దశ కౌన్సెలింగ్‌ వరుస సంఖ్య ఒకటి నుంచి 800 వరకు ఈ నెల 25న, వరుస సంఖ్య 801 నుంచి 1404 వరకు 26న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో హాజరుకాని విద్యార్థులు సీట్లు కోల్పోయే అవకాశముందని తెలిపారు. మొదటి దశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థుల స్థానంలో సీట్ల కోసం వెయిటింగ్‌ లిస్టును ఈ నెల 28న విడుదల చేసి రెండో దశ కౌన్సెలింగ్‌ వచ్చే నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ, గ్లోబల్‌ విద్యార్థులకు ఈ నెల 19న, ఎన్‌సీసీ క్యాప్‌ విద్యార్థులకు ఈ నెల 29న, పీహెచ్‌ విద్యార్థులకు జూలై 1న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కోటా జాబితాను కమిటీ నిర్ణయం మేరకు త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ఈ ఏడాది సీటు కోసం తీవ్ర పోటీ ఉందని, 10 జీపీఏ సాధించిన కొందరు విద్యార్థులకు కూడా సీటు రాలేదన్నారు.

300
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles