బాలికా విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం..

Sun,June 16, 2019 01:32 AM

ముదిగొండ: జయశంకర్‌ బడిబాటలో భాగాంగా శనివారం ముదిగొండ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌డీఓ పీడీ ఇందుమతి మాట్లాడుతూ ప్రభుత్వం బాలికా విద్యతోపాటు మహిళలను అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రోత్సహి స్తుందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణా ప్రభుత్వం వీ-హబ్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ నెలకొల్పిందన్నారు. జిల్లాలో 12 మంది జిల్లా స్థాయి అధికారిణులు మహిళలేనన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా కస్తూర్భా పాఠశాల ఏర్పాటు చేయటంతో పాటు ఉన్నత విద్యలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించారన్నారు. బాలికల ఆరోగ్య సమస్యల దృష్ట్యా బాలికా ఆరోగ్య రక్ష కిట్లను ప్రభుత్వం అందజేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను, విద్యార్థినులకు హెల్త్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకట్రామిరెడ్డి, ఎంఈఓ నాగేశ్వరరావు, జీసీడీఓ ఉదయశ్రీ,ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు, ఈజీఎస్‌ ఏపీఓ అజయ్‌, గ్రామ సర్పంచ్‌ మందరపు లక్ష్మీ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

288
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles