రియల్‌ కబ్జాలో ఆ ఇద్దరు!

Sun,June 16, 2019 01:32 AM

ఖమ్మం నమస్తే తెలంగాణ: ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి పరిధిలో సుమారు రూ. 3 కోట్ల భూ రియల్‌ దందా వెనుక బిల్డర్ల తరుఫున ఒక పోలీస్‌ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతనికి తోడుగా ఒక రెవెన్యూ అధికారి కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. రియల్‌ దందాపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనంతో ఈ దందాలో పాత్రదారులుగా ఉన్న వివిధ శాఖల అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. బిల్డర్లు ఇచ్చిన మాముళ్లకు తలొగ్గిన రెవెన్యూ, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌, ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌ అధికారులు ఆయా డాక్యూమెంట్లను తెప్పించుకుని చేసిన తప్పును సరిచేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయంపై ఒక పోలీస్‌ అధికారి ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్ద మొత్తంలో డీల్‌ కుదిరించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనే సదరు అధికారి ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య చర్చలు జరిపారు. అదికాస్త కుదరకపోవడంతో ఒక దశలో బెదిరింపులకు పాల్పడి నట్లు సమాచారం. కాగా ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నంబర్‌ 292/ఆ లో 1331 గజాల స్థలం విలువ రూ. మూడు కోట్లకు పై మాటే. ఆ మొత్తం స్థలంలో ముగ్గురు వ్యక్తులకు చెందినది. ఐతే రియల్‌ బిల్డర్లకు 287 సర్వే నెంబర్‌లో స్థలం ఉంటే 292/ఆలో ఉన్నట్లు డాక్యూమెంట్లను సృష్టించడంలో జిల్లా పనిచేస్తున్న ఒక రెవెన్యూ అధికారి కీలకపాత్ర పోషించినట్లు వినికిడి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. జిల్లా పోలీస్‌ బాస్‌ ప్రత్యేక దృష్టితో రంగం లోకి దిగిన నిఘా విభాగం అధికారులకు విస్తుపోయే నిజాలు తెలియడంతో సదరు డీల్‌ కుదిరించుకున్న పోలీస్‌ అధికారి తప్పించుకునే ప్ర యత్నాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. శనివా రం ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ జే శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు స్థలం వద్దకు చేరుకుని డాక్యుమెంట్లను పరిశీలించారు.

352
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles