జమలాపురం వేంకన్నకు ప్రత్యేక పూజలు

Sun,June 16, 2019 01:32 AM

ఎర్రుపాలెం, జూన్‌15: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పంచామృతాలతో అభిషేకించారు. నూతనవస్ర్తాలు ధరింప చేసి పూలమాలలు, తులసి నామాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శింపచేశారు. మహిళా భక్తులు పాలపొంగల్లు చేసి స్వామివారికి నివేదించారు. భక్తులు స్వామివారికి భక్తకల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నపూర్ణసత్రంలో భక్తులకు అన్నదానం జరిపారు. పద్మావతి భజన బృందం వారిచే కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఉప్పల వెంకట జయదేవశర్మ, కార్యనిర్వహణాధికారి పీ.ఉదయ్‌భాస్కర్‌, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, విజయదేవశర్మ, సుదర్శన్‌శాస్త్రీ, రామకృష్ణశాస్త్రీ, ధర్మకర్తల మండలి సభ్యులు కోనా చంద్రశేఖర్‌, సిబ్బంది విజయకుమారి, ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.

287
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles