సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక

Sun,June 16, 2019 01:33 AM

-ప్రతి ఇంటికి చెక్కులు అందించింది నేనే
-ఖమ్మంను చూసి ఇతర ఎమ్మెల్యేలు చెక్కులను ఇంటింటికీ అందిస్తున్నారు..
-52 మందికిగాను రూ. 51.31 లక్షల చెక్కులు పంపిణీ
- ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి భరోసా కల్పించాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాన్ని తన మానసపుత్రికగా చేసు కున్నారని అందుకే ప్రతీ పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్‌ కొండంత అండగా నిలుస్తున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని 1వ డివిజన్‌ నుంచి 30 డివిజన్‌ వరకు సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌ ప్రాంగణం, 31వ డివిజన్‌ నుంచి 50డివిజన్‌ వరకు త్రీటౌన్‌లోని పంపింగ్‌ వెల్‌రోడ్‌లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం క్రింద మంజూరైన రూ. 51.31 లక్షల విలువైన 52 చెక్కులను శనివారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పడుచుల వివాహాలు జరిపించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా తల్లిదం డ్రులను ఆదుకోవాలనే సదుద్దేశంతో పాటు ప్రతి నిరుపేద ఆడపిల్ల సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు.

గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ సర్కార్‌ పార్టీలు, రాజకీయాలకతీతంగా అర్హతను ప్రాతిపదికగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ ఆడపిల్లల తల్లులకు పెద్దన్నలాగా, పెళ్లి కూతుర్లులకు మేనమామాలా ఆదుకుంటున్నారన్నారు. ప్రతి ఇంట్లో సంతోషమే ధ్యేయంగా ఆడపిల్లల పెళ్లిళ్ల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ వంటి బ్రహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుపరిపాలనకు నిదర్శనమని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. వివాహాలు జరిపించిన యువ తుల కుటుంబాలకు తొలినాళ్లలో రూ. 51వేలు అందించిన ప్రభుత్వం... తరువాత రూ. 75 వేలు ఇచ్చిందన్నారు. తాజాగా ఈ పథకం ద్వారా లక్ష నూటపదహారు రూపాయలు అందిస్తున్నదంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలపై ఉన్నటువంటి ప్రేమ ఏమిటో తెలుస్తున్నదని తెలిపారు.

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం ప్రారంభం అయిన నాటి నుంచి ఆయా చెక్కులను ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా అందించిన విషయం గుర్తు చేశారు. ఖమ్మాన్ని చూసి ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం ఇంటింటికి వెళ్లి ఇస్తున్నారని ఖమ్మం రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రూ. 50వేల నుంచి మొదలుకొని రూ. 75 వేలు, ఇప్పుడు లక్ష రూపాయలు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. మన రాష్ర్టాన్ని చూసి ఇతర రాష్ర్టాలు ఇప్పుడు అదే బాట పట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వీ రామూర్తి, గిర్దావర్‌ రాజేష్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, ప్రశాంతలక్ష్మీ, గాజుల వసంత, కర్నాటి కృష్ణ, మండదపు మనోహర్‌, పగడాల నాగరాజు. వలరాజ్‌, షౌకత్‌ అలీ, దాదే ధనలక్ష్మీ, ఆళ్ల నిరీషా రెడ్డి, నీలం జయమ్మ, మాటేటి నాగేశ్వరరావు, రుడావత్‌ రమాదేవి, తోట రామారావు, రుద్రాగని శ్రీదేవి, ఏ హనుమాన్‌, కనకం లక్ష్మీ, నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, తోట వీరభద్రం, ఉపేందర్‌, నీలం కృష్ణ, సంక్రాంతి నాగేశ్వరరావు, వీఆర్‌వోలు, అన్ని డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులున్నారు.

353
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles