హరితహారానికి సిద్ధంగా ఉండాలి:కలెక్టర్‌

Tue,June 18, 2019 01:12 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణకు హరితహారం కింద 2019 సంవత్సరానికి జిల్లాకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించే విధంగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో 2019 సంవత్సరానికి హరితహారం పై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం 3 కోట్ల 95 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో వివిధ శాఖల ద్వారా నర్సరీలలో మొక్కలను పెంచడం జరిగిందన్నారు. తదానుగుణంగా ఈ సంవత్సరం జిల్లాలో 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించి నట్లు తెలిపారు. గృహ అవసరాలు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, రో డ్డుకిరువైపులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పారిశ్రామిక కేంద్రాల ఖాళీస్థలాలలో మొక్కలను నాటేందుకు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో మొక్కలు నాటేందుకు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాకు నిర్దేశించిన 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా

వివిధ శాఖలకు లక్ష్యాలను కేటాయించడం జరిగిందని, పోలీసు, అటవీ శాఖ వారికి కోటి మొక్కలు, అదేవిధంగా జిల్లా గ్రామీణాభివృద్ధ్దిశాఖ ద్వారా కోటి మొక్కలు, ఐటీసీ ద్వారా 50 లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా 15 లక్షలు, ఉద్యానశాఖ ద్వారా 10 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 28 లక్షలు, సింగరేణి ద్వారా 25 లక్షలు, ఎక్సైజ్‌శాఖ ద్వారా 3 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయిం చడమైనదని, తదానుగుణంగా ఆయా శాఖ లు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని విద్యాసంస్థలు, కోల్డ్‌స్టోరేజ్‌లు, వివిధ పరిశ్రమ కేం ద్రాల బాధ్యులను అధిక మొత్తంలో భాగస్వాము లు చేయాలని కలెక్టర్‌ సూ చించారు. ఎన్‌ఎస్‌పీ కాలువ వెంబడి, చెరువుల గట్లపై నాటే మొక్కలను అవసరాలకనుగుణంగా ముందస్తు గానే సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, సహాయ కలెక్టర్‌ హన్మంతు కొడింబా, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ్‌, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఇందుమతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, ఉద్యానవన శాఖాధికారి అనసూయ, జిల్లా సంక్షేమశాఖాధికారి ఆర్‌ వరలక్ష్మీ, ముఖ్య ప్రణాళికాధికారి సుబ్బారావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సోమిరెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ శ్యామ్‌ప్రసాద్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ జే శ్రీనివాసరావు, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

241
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles