శాంతించిన భానుడు..కరుణించిన వరుణుడు

Tue,June 18, 2019 01:12 AM

ఖమ్మం వ్యవసాయం: రెండు నెలలుగా భా నుడి ఉగ్రరూపానికి అల్లాడి పోయిన జిల్లా ప్రజానీకం సోమవారం ఉపశమనం పొందా రు. భానుడు శాంతించడం, వరుణదేవుడు కరుణించడంతో ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాష్టంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్న తరుణంలో ముందస్తుగానే ఆకాశం మేఘామృతం కావడం, అక్కడక్కడ చిరుజలుల్లలు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా ఈ సంవత్సరం మే నెల ఆరంభం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అనేక ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఖసోమవారం ఉదయం నుంచే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకు న్నాయి. ఖమ్మం నగరం పరిసర మండలాలు అయిన కొణిజర్ల, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాలో చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మాధ్యాహ్నం నుంచి ఖమ్మం నగరంలో భారీ వర్షం కురిసింది. అనంతరం ముసురుతో కూడిన వర్షం సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో నగరంలోని ప్రధాన కూడలీలతో పాటు శివారు కాలనీల వీధులలోకి వరద నీరు వచ్చి చేరింది. చాలాకాలం తరువాత వాతావరణం చల్లబడడటం, భారీ వర్షం సైతం పడటంతో నగరవాసులు సేదతీరారు. వాతావరణం చల్లబడటం, ఓ మోస్తారు వర్షం సైతం కురవడంతో ఆయా మండలాలకు చెందిన రైతులు నగరానికి భారీగా వచ్చి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. నగరంలోని త్రీటౌన్‌ ప్రాంతంలో విత్తన, ఎరువుల షాపులు రైతులతో రాకతో కళకళలాడాయి.

274
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles