ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

Tue,June 18, 2019 01:12 AM

ఖమ్మం వ్యవసాయం: ఈ నెల 20న రుతు పవనాలు రానున్నాయని ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతులు ఆనందభరితులవుతున్నారు. వారికి ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్‌కు ముందుగానే పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభించింది. గత ఏడాదికంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది.అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరీఫ్‌ ప్రణాళికను తయారు చేసింది. సాగుకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు నెలల నుంచి భూసార పరీక్షలను వేగవంతం చేశారు. విత్తన, ఎరువుల కొరత రాకుండా ఉండేందుకుగాను ఇప్పటికే పలు ధపాలుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తన, ఎరువుల డీలర్లతో సమావేశాలు నిర్వహించారు. మొదటి విడతకు సంబంధించిన సీడ్స్‌, ఎరువుల ఇండెంట్‌ను ఆయా కార్పొరేషన్లకు పంపించారు. ప్రస్తుతం జిల్లా టీ సీడ్స్‌ గోడౌన్‌ నుంచి జిల్లాలోని ఆయా సహకార సంఘాలకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి పత్తి విత్తనాలు క్రయ విక్రయాలు జరగనున్నాయి. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 2.30 లక్షల హెక్టార్లలో వివిధ రాకాలైన పంటలు సాయ్యే అవకాశం ఉందని, ఇందుకోసం సుమారు 2.14 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం రావచ్చని జిల్లా యంత్రాంగ అంచనా వేసింది. గతానికంటే ఎక్కువ మొత్తంలో పత్తి సాగుయ్యే అవకాశం ఉంది.

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమైన రైతాంగం...
మరో నాలుగు రోజుల్లో రుతు పవనాలు రానుండడంతో రైతులు దుక్కులు దున్నేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపరాల పంటలు సాగు చేసుకునేందుకు దున్ని సిద్ధంగా ఉంచారు. వరి, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు వారం రోజులుగా పచ్చరొట్ట విత్తనాలన్తు వ్యవసాయ క్షేత్రంలో చల్లుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని రైతులు కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఈ సంవత్సరమైనానీరు విడుదలవుతుందో లేదోనన్న ఆలోచనలో పడ్డారు. ముందుగా అపరాల సాగు చేపాట్టాలా వద్దా అనే ఆలోచన చేస్తున్నారు. కొందరు రైతులు అపరాల సాగుకు దుక్కులను సిద్ధం చేశారు. 2017-18 సంవత్సరానికిగాను జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2.34 లక్షల హెక్టార్లలో వివిధ రకాలైన పంటల సాగు కావచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకు అనుగూణంగా సాగు జరిగింది. ఈ సంవత్సరం సైతం జిల్లావ్యాప్తంగా 2.30 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావచ్చని అంచన వేసింది. అత్యధికంగా పత్తి దాదాపు లక్ష హెక్టార్లలో సాగు కావచ్చని ప్రణాళిక సిద్ధం చేసింది. గత యాసంగి సీ జన్‌లో ఆశించినంత సాగు జరగలేదు. దీంతో జిల్లా రైతాంగం ఖరీఫ్‌ సాగు కోసం గంపెడు ఆశలు పెట్టుకుంది.

ఊపందుకోనున్న పత్తి క్రయ విక్రయాలు
ఈ సంవత్సరం ఆశించినంత వర్షాలు కురుస్తాయనే సంకేతాలు వెలువడటంతో జిల్లా కేంద్రంలోని వివిధ కంపెనీల డీలర్లు, జిల్లాలోని ఇతర పట్టణ, మండల కేంద్రాల్లోని సబ్‌ డీలర్లు ముందస్తుగానే విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను నిల్వ ఉంచుకున్నారు. వారం రోజులుగా పత్తి, ఇతర విత్తనాల కోసం జిల్లా రైతాంగం నగర కేంద్రానికి రావడం ఆరంభమైంది. విత్తనాలు విత్తుకునేందుకు ఇది సమయం కానందున అధికారులు కొద్ది రోజుల పాటు స్టాప్‌ సేల్‌ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్టానికి వచ్చే అవకాశం ఉన్నందున డీలర్లు విత్తనాల అమ్మకాలు ప్రారంభించారు. నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో ఒకటి, రెండు మండలాల్లో నకిలీల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎరువుల కొరతను నివారించేందుకు జిల్లా మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికను తయారు చేశారు. అందుకు అనుగుణంగానే ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువులను ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాములలో నిల్వ ఉంచారు. ఈ సంవత్సరం సైతం జిల్లాలోని వివిధ సొసైటీల ద్వారా మండల వ్యవసాయ శాఖ అధికారుల ధ్రువీకరణ ప్రకారంగా రైతులకు ఎరువులను ఇవ్వనున్నారు.

కొనసాగుతున్న రాయితీ విత్తనాల పంపిణీ
ఈ సంవత్సరం వర్షపాతం గణనీయంగా నమోవుతుందనే సంకేతాలు రావడంతో ఆ దిశగా అధికారులు ముందస్తుగానే విత్తన నిల్వలను జిల్లా కేంద్రంలో ఉంచారు. 20 రోజుల నుంచి నుంచి నిరంతరాయంగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ సాగుతోంది. మరో పదిహేను రోజులపాటు క్రయవిక్రయాలు జరగనున్నాయి. మొదటి ఇండెంట్‌కు మించి విత్తనాలను సొసైటీలకు సరఫరా చేశారు. వానాకాలం సీజన్‌లో సాగు చేసే వరి, మొక్కజొన్న, కంది, పెసర విత్తనాలు సైతం రైతులకు పంపిణీ చేస్తున్నారు.

261
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles