అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి

Tue,June 18, 2019 01:13 AM

-జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌జయంతి
ఖమ్మం, నమస్తే తెలంగాణ :గ్రీవెన్స్‌డేను పురస్కరించుకొని సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, సహాయ కలెక్టర్‌ హన్మంతు కొడింబా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, అర్జీదారుల సమస్యలను సత్వర మే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పట్టదారు పాసుపుస్తకాలు, భూసర్వేలు, రైతుబంధు, పాఠశాలలో ప్రవేశాలు, బ్యాంకు రుణాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల గురించి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. పట్టదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన అర్జీలపై జాయింట్‌ కలెక్టర్‌ సత్వరమే సంబంధిత తహసీల్దార్లతో సంప్రదించి అర్జీదారులకు పరిష్కార స్వభావాన్ని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులకు సంబంధించిన అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. కొణిజర్ల మండలం వేపకుంట్ల గ్రామానికి చెందిన చల్లగుండ్ల నర్సింహచారి తన భూమి సర్వేనెం. 149/2ఉ లో గల 3 ఎకరాల భూమికి నూతన పట్టదారు పాస్‌పుస్తకము మంజూరుకోసం సమర్పించిన దరఖాస్తుపై కొణిజర్ల తహసీల్దారును విచారణ చేసి నివేదిక సమర్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

అదేవిధంగా వైరా మండలం గొల్లపూడి నుంచి వచ్చిన ఎం రాధమ్మ తన భూమి సర్వేనెం. 846లో గల 14 ఎకరాలకుగాను 11 ఎకరములకు పట్టదారు పాస్‌పుస్తకం ఇచ్చారని, మిగిలిన 3 ఎకరాలకు పాస్‌పుస్తకము జారీచేయగలరని సమర్పించిన అర్జీను సత్వర చర్యకై తహసీల్దారును ఆదేశించారు. సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన వేముల రామమూర్తి తనకు రైతుబంధు మంజూరు కాలేదని సమర్పించిన అర్జీని పరిశీలించి తదుపరి చర్య తీసుకోవాలని సింగరేణి తహసీల్దారును ఆదేశించారు. ముదిగొండ మండలం గోకినేపల్లి నుంచి వచ్చిన జీ నాగేంద్రమ్మ తన భూమి ఆక్రమణకు గురైందని తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి నివేదిక సమర్పించాలని ముదిగొండ తహసీల్దారును ఆయన ఆదేశించారు. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెంకు చెందిన కే రామారావు ఇనాం భూమి ఓఆర్‌సీ ఇప్పించగలరని సమర్పించిన అర్జీ ను తగు చర్య కో సం రూరల్‌ తహసీల్దారుకు సూచించారు.ఖమ్మం నగరం గట్టయ్యసెంటర్‌కు చెందిన కె రాంబాయి పో లియోవ్యాధి వల్ల తన రెండు కాళ్లు పనిచేయుట లేదని తనకు వీల్‌చైర్‌ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తుపై జాయింట్‌ కలెక్టర్‌ సత్వరమే స్పందించి వీల్‌చైర్‌తో పాటు ఆమెకు అర్హత కలిగిన ఇతర లబ్ధిని కూడా అందించాలని జిల్లా సంక్షేమశాఖాధికారికి సూచించారు.

ఉపాధి హామీ కలీలకు కూలీధరను పెంచాలని, వారు పనిచేసేచోట కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలను కేటాయించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సమర్పించిన అర్జీని తగు చర్యకై కలెక్టరేట్‌ కార్యలయపు పరిపాలన అధికారికి సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఇందుమతి, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కళావతీబాయి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జే శ్రీనివాసరావు, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ నర్సింహులు, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్‌ చక్రవర్తి, భూసర్వే సహాయ సంచాలకులు రాము, చిన్నతరహా నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా విద్యశాఖాధికారి మదన్‌మోహన్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి ఆర్‌విరలక్ష్మీ, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు గ్రీవెన్స్‌డేలో పాల్గొన్నారు.

318
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles