ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల అడ్డగింత

Tue,June 18, 2019 01:13 AM

కూసుమంచి: మండలంలోని బోడియాతండా, చౌ టపల్లి పంచాయతీల్లో సోమవారం ప్రైవేట్‌ స్కూళ్ల బస్సులను ఆయా గ్రామాల ప్ర జలు అడ్డగించారు. బడి బా ట కార్యక్రమంలో భాగం గా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయు లు ర్యాలీ, సామూహిక అక్ష రాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయం లో మండలంలోని పాలేరు, నాయకన్‌గూడెం, కూసుమంచి గ్రామాలకు చెందిన ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు విద్యార్థుల కోసం వెళ్లాయి. వాటిని గ్రామస్తులు అడ్డుకున్నారు. “మా పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించం. ఇక మీదుట మీ బస్సులను మా గ్రామానికి పంపించొద్దు” అని చెప్పారు. బోడియాతండా సర్పంచ్‌ రాణి, ఇప్పటికే తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో చౌటపల్లి, బోడియాతండా సర్పంచ్‌లు మమత, భూక్యా రాణి, గ్రామ పెద్దలు సుధాకర్‌, రాములు, వెంకన్న, భూక్యా రవి, వీరబాబు పాల్గొన్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles