వాటర్‌ట్యాంక్‌ ఎక్కి రైతుల ఆందోళన

Tue,June 18, 2019 01:13 AM

చండ్రుగొండ, జూన్‌ 17 : తమ సమస్యలు పరిష్కరించాలని , రైతుబంధు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ రైతులు సోమవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గల వాటర్‌ట్యాంకు ఎక్కి ముఖ్యమంత్రి చిత్రపటంతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకపోడు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిని వెంకటేశ్వరరావు మాట్లాడారు. 8 ఎనిమిది రోజులుగా రెవెన్యూ కార్యలయం ఎదుట నిరసనదీక్షలు చేస్తున్నా కనీసం అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.
తహసీల్దార్‌ చొరవతో విరమించిన ఆందోళన
వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆందోళన చేస్తున్న ఆదివాసీ రైతులతో తహసీల్దార్‌ రావూరి రాధిక పలుమార్లు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశానని, అవసరం అయితే నేను కూడా కొత్తగూడెం ఆర్డీఓ దగ్గరకు మీవెంట వస్తానని హామీ ఇవ్వడంతో ఆదివాసీ రైతులు ఆందోళన విరమించారు. వెంటనే తహసీల్దార్‌తో సహా, ఆదివాసీ రైతులు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంకు వెళ్లారు. ఆందోళన సమయంలో చుట్టు పక్కల నుండి గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో రెవెన్యూ కార్యాలయంకు చేరుకున్నారు. జూలూరుపాడు సీఐ రాయల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ నాగేశ్వరావు, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్‌, ఏఎస్సై కొటేశ్వరరావు, ఆర్‌ఐ రాజశేఖర్‌, వీఆర్‌ఓలు, కొత్తగూడెం పైర్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

323
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles