విత్తన షాపులలో విజిలెన్స్‌ అధికారుల సోదాలు

Tue,June 18, 2019 01:13 AM

ఖమ్మం వ్యవసాయం, జూన్‌ 17: నగరంలోని పలు విత్తన, ఎరువుల షాపులలో విజిలెన్స్‌, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ సీఐ ఖరీముల్లాఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాలలో నగరంలోని ఎంఎస్‌ సోవరిన్‌ ఆగ్రో ఏజన్సీలో గడవు తీరిన సుమారు రూ 8.07 లక్షల విలువైన కూరగాయల ప్యాకెట్లు, రూ 1.72 లక్షల విలువైన పురుగుమందులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నకిలీల విత్తనాల గుర్తించడం కోసం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విత్తన షాపులలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలో ఆకస్మిక తనిఖీలు చేశమన్నారు. కాలం చెల్లిన విత్తనాలను తిరిగి కంపెనీకి పంపించకుండా నిల్వ చేసిన పత్తి విత్త నాలు, ఆయా కంపెనీల పురుగుమందులను స్వాదీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన తరువాత లాట్‌ ఐడీ నెంబర్‌తో కూడిన రశీదును తప్పకుండా తీసుకోవాల న్నారు. అదే విధంగా తయారి తేదీ, ముగింపు తేదీలను సైతం చూసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. నకి లీ విత్తనాలు రైతులకు అంటగడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హె చ్చరించారు. ఈ దాడులలో విజిలెన్స్‌ రాష్ట్ర కార్యాలయం అధికారి బీ రాజేందర్‌, ఖమ్మం అర్బన్‌ మండల వ్యవ సాయశాఖ అధికారి బీ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

327
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles