భార్యపై కత్తితో భర్త దాడి

Wed,June 19, 2019 02:09 AM

- తీవ్రంగా గాయపడిన బాధితురాలు
- పరారిలో నిందితుడు
పాల్వంచ, జూన్‌ 18: పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన ఉండ్రోజు కరుణ అనే వివాహితపై మంగళవారం తెల్లవారుజామున ఆమె భర్త వెంకటేశ్వరరావు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పాత పాల్వంచకు చెందిన కరుణను ఖమ్మం పట్టణానికి చెందిన ఉండ్రోజు వెంకటేశ్వరరావుతో మూడెళ్ల క్రితం కరుణకు వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గత రెండేళ్ల నుంచి వెంకటేశ్వరరావు భార్యను అనుమానిస్తూ వేదింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల కొంత కాలం నుంచి భర్త వేదింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక మూడు రోజుల క్రితం తల్లిగారిలైన పాత పాల్వంచకు కరణ వచ్చింది. తర్వాత వెంకటేశ్వరరావు కూడా సోమవారం పాతపాల్వంచకు వచ్చాడు. సోమవారం రాత్రి ఆమెతో బాగానే ఉన్నాడు. కాని మంగళవారం ఉదయం 4.30గంటల సమయంలో అకస్మాత్తుగా భార్యపైకి కత్తితో దాడి చేసి తలమీద పొడిచి పారిపోయాడు. ఈలోపు పక్కనే నిద్రిస్తున్న బాలుడు తీవ్రంగా ఏడుస్తుండడంతో బాధితురాలి తల్లి వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో కూతరు కన్పించింది. వెంటనే బాధితురాలిని చుట్టుపక్కల వారి సహకారంతో 108 ద్వారా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
సంఘటనా స్థలానికి సీఐ మడత రమేష్‌ గౌడ్‌ సందర్శించారు. బాధితురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

291
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles