సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలోనే.. కులవృత్తులకు ప్రోత్సాహం

Wed,June 19, 2019 02:09 AM

-గొల్ల, కురుమలకు న్యాయం జరిగింది
-గొర్రెల, మేకలకు నట్టల మందు పంపిణీ
-ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌
రఘునాథపాలెం, జూన్‌18: తెలంగాణ ప్రభుత్వంలోనే గొల్ల, కురుమలకు న్యాయం జరిగిందని, రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్‌ వారి ఆర్థికాభివృద్ధికి తాడ్పాటును అందిస్తున్నారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని గొల్లగూడంలో గొర్రెల, మేకలకు ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటు జరిగిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొల్ల, కురుమల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. 75శాతం రాయితీపై గొల్ల, కురుమలకు గొర్రెల, మేకలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

గత పాలకులు గొర్రెల పెంపకందారులకు గుర్తించిన పాపానపోలేదన్నారు. రాష్ర్టాల నుంచి మాసం ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం దిగజారిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన గొర్రెలు, మేకల పంపిణీతో తెలంగాణ రాష్ట్ర నుంచే ఇతర రాష్ట్రాలు మాసం ఉత్పత్తులను ఎగుమతి చేసుకుంటున్నాయన్నారు. తద్వారా గొల్ల, కురుమలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారన్నారు. ఖమ్మం నగరంలోని విలీన పంచాయతీలలో నివసిస్తున్న యాదవ, కురుమలకు సబ్సిడీ గొర్రెలను అందించేందుకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి సాధించుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈనెల 27న గొర్రెల పంపిణీని చేపట్టుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు గానూ రోటరీనగర్‌లోని డైరీ స్థలం ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ జేడీ నర్సింహులు, ఏడీ సురేందర్‌, స్పెషల్‌ ఏడీ రమేష్‌, మండల పశువైధ్యాధికారి కిషోర్‌, కార్పొరేటర్‌ కూరాకుల వలరాజు, నాయకులు తోట ప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌ బత్తుల నాగేశ్వరరావు, రవి, షరీఫ్‌, జానీ, మీరా, హరికృష్ణ, దస్తగిరి పాల్గొన్నారు.

298
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles