ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి

Wed,June 19, 2019 02:10 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు విధిగా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల ఫలితాలు వెలువడిన ముప్పై రోజుల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు రాంసింగ్‌ షెకావత్‌, మనిగంధసామిలతో కలిసి అకౌంట్‌ రీకన్సిలేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల లోపు సమర్పించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను ఆయా వ్యక్తుల షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేయబడిన వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో సరి చూశారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు రాంసింగ్‌ షెకావత్‌, మణిగంధ సామిలు మాట్లాడుతూ ఎన్నికల ప్రకియలో అభ్యర్థుల వ్యయ వివరాలను సమర్పించడం ప్రధానమన్నారు. నిర్ధేశిత గడువులోగ అభ్యర్ధులు తమ ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించి సరిచూసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎక్స్‌పెండీచర్‌ నోడల్‌ అధికారి యూ రాజు, జిల్లా ఆడిట్‌ అధికారి వెంకటేశ్వరరెడ్డి, శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

268
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles