వరించిన విజయం..

Thu,June 20, 2019 01:52 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్: సర్కారు కొలువు సాధించడం ఈ తరం యువత కల.. మరి దాన్ని నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వం నోటిఫి కేషన్లు విడుదల చేయాల్సిందే.. ఉమ్మడి పాలనలో నిరుద్యోగులు ని ర్లక్ష్యానికి గురయ్యారనేది వాస్తవం.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చొరవ చూపుతూ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.. దీంతో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగ యువత కొలువులు సాధిస్తున్నారు.. ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అందులోనూ సర్కారు కొలువంటే జీవితాంతం ఉద్యోగ భద్రత..! గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన గురుకులాల పరీక్షలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కొలువులు సాధించారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి గురువులుగా ఎదిగారు.. కొత్తగూడెం ప్యూన్‌బస్తీకి చెందిన కొండపల్లి వీరకుమార్, త్రీ ఇైంక్లెన్‌కు చెందిన గాండ్ల రాజసమ్మయ్య పీజీటీ ఉద్యోగాలు సాధించి ఇతర యువకులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరకుమార్ మణుగూరుకు చెందిన సోషల్‌వెల్ఫేర్ పాఠశాలలో పీజీటీగా, రాజసమ్మయ్య పాల్వంచ మైనార్టీ బాలుర గురుకులంలో పీజీటీగా కొలువులో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఉద్యోగాల కల్పన జరుగుతుందని, 2006 నుంచి తాము ఉద్యోగాల కోసం శ్రమించామని చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే తమలాంటి వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగ జీవితం తమకు సంతృప్తినిస్తోందని, గురుకులాలు కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం కాదని చెప్తున్నారు. సీఎం కేసీఆర్ గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడటం హర్షణీయమన్నారు. విద్యార్థినీ విద్యార్థులు గురుకులాల్లో అందుతున్న సౌకర్యాలను, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

300
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles