వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

Thu,June 20, 2019 01:52 AM

కూసుమంచి,జూన్19:మండల పరిధిలోని నాయకన్‌గూడెం ఎస్సీ కాలనీ సమీపంలో సూర్యాపేట- ఖమ్మం రోడ్డుపై కారు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పాకాలపాటి నర్సమ్మ (70) బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో నర్సమ్మ తీవ్రంగా గాయపడింది. కారు డ్రైవర్ వాహనాన్ని ఆపి, దిగి చూసి, వెంటనే వెళ్లిపోయినట్లు ప్రతక్ష్యసాక్షులు తెలిపారు. కారు నలుపు రంగు లో ఉందని, నంబర్ గమనించిలేదని చెప్పారు.నర్సమ్మ ను కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక పోలీసులు మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నర్సమ్మ కొడుకు కొన్నేళ్ల క్రితం మృతిచెందగా, కోడలు, ఇద్దరు మనవళ్లు ఆమెను పోషిస్తున్నారు.
వైరా,నమస్తే తెలంగాణ:వైరాలోని మధిర క్రాస్ రోడ్డు లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాదంలో స్థానిక హనుమాన్ బజార్‌కు చెందిన వేముల వెంకన్న(34) మృతి చెందాడు. బుధవారం ఉదయం 8గంటల సమయంలో వేముల వెంకన్న మధిర క్రాస్ రోడ్డుకు టీ తాగేందుకు వచ్చాడు. అనంతరం వెంకన్న రాష్ట్రీయ 8వ ప్రధాన రహదారిపై మధిర క్రాస్ రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి తల్లాడ వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో వెంకన్న తల పూర్తిగా నుజ్జునుైజ్జెంది. రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ వెళ్లిపోయింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు వైరాలోని హైలెవెల్ వంతెన సమీపంలో లారీని పట్టుకున్నారు. వైరాలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

278
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles