ఓసీ ప్రభావిత గ్రామాల్లో అధికారుల బృందం పర్యటన

Thu,June 20, 2019 01:53 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సింగరేణి ఓపెన్‌కాస్ట్ నిర్వహణలో బ్లాస్టింగ్ కారణంగా స్థానిక ఎన్టీఆర్‌నగర్ కాలనీకి చెందిన నివాస గృహాలు ధ్వంసం అవుతున్నా యంటు స్థ్దానికులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారుల బృందం విచారణ చేపట్టింది. 1985 సంవత్సరంలో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటైన ఎన్టీఆర్ నగర్ కా లనీ ఇటీవల సింగరేణి బ్లాస్టింగ్‌ల కారణంగా తీవ్రంగా దెబ్బతిని ఇంటి పై పెచ్చులు ఊడి, గోడలు బీటలు బారుతున్నాయంటు స్థానికులు విచారణ బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తు వారి ఇళ్లను చూపించారు. విచారణకు వచ్చిన అధికారులు బృందం వారి నుంచి వివరాలు సేకరించారు. పలు నివాస గృహాలను సందర్శించి రిపోర్ట్ నమోదు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు మాట్లాడుతు సింగరేణి అడుగుపెట్టిన నాటి నుంచి ఇళ్లు ధ్వంసం అవడం మొదలైందన్నారు. సింగరేణి యాజమాన్యానికి రాబడి పై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నగర్‌లో ధ్వంసం అయిన ఇళ్ల స్థానం లో కొత్త ఇళ్లునిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. విచారణ బృందంలో లైనింగ్‌రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి, పారిశ్రామిక శాఖ జీఎం కృష్ణారావు,డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ లుర్థూ, తహసీల్దార్ విజయకుమార్, గిర్దావర్లు విజయభాస్కర్, జగదీశ్,సర్వేయర్ వెంకన్నలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి ఎంపీటీసీ ఇరపా క్రిష్ణారావు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారా వు, సీపీఐ జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

281
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles