వే మెన్ ఇంటిగ్రేషన్‌తో పారదర్శకత

Thu,June 20, 2019 01:53 AM

-వ్యాపారుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటాం
-సమీక్షలో మార్కెటింగ్‌శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్
ఖమ్మం వ్యవసాయం, జూన్ 19: నగర వ్యవసాయ మార్కెట్లో అమలు జరుగుతున్న వే మెన్ ఇంటిగ్రేషన్ విధానంతో మరింత పారదర్శకత వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. బుధవారం నగర వ్యవసాయ మార్కెట్ సందర్శనకు వచ్చిన ఏడీ మార్కెట్ పరిధిలోని మిర్చి ఖరీదుదారులు, దిగుమతిశాఖ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి మిర్చి క్రయవిక్రయాలలో అమలు జరుగుతున్న వే మెన్ ఇంటిగ్రేషన్ విధానంపై ఆయన మార్కెట్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రయ విక్రయాలలో మరింత పారదర్శకత తీసుకరావాలనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లోకి తీసుకిచ్చామన్నారు. దీంతో అటు రైతులకు, ఇటు వ్యాపారులకు సైతం ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సకాలంలో కాంటాల ప్రక్రియ జరిగేందుకు, తూకాలలో ఎలాంటి తేడా రాకుండా ఉండేందుకు ఈ విధానం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. పత్తి, అపరాల క్రయ విక్రయాలలో ఈ నామ్ విధానం పూర్తి స్థాయిలో మొదటి దశ అమలు చేయడం జరుగుతుందన్నారు. వే మెన్ ఇంటిగ్రేషన్ విధానం పూర్తి స్థాయిలో అమలు జరిగితే ఈ నామ్ విధానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో జాయింట్ కలెక్టర్ సమక్షంలో మరోమారు సమావేశం అనంతరం వ్యాపారుల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వరంగల్ రీజియన్ మార్కెటింగ్‌శాఖ ఉపసంచాలకుడు ఏ రాజు, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ఆర్ సంతోష్‌కుమార్, వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి గుడవర్తి శ్రీనివాసరావు, మాటేటి రామారావు, మెంతుల శ్రీశైలం, మలిశెట్టి వెంకటేశ్వర్లు, సుదీర్, మార్కెట్ కమిటీ అధికారులు బజార్, వీరాంజనేయులు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

275
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles