గాంధీయిజం ఒక జీవనమార్గం..

Thu,July 11, 2019 01:23 AM

- జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం : జడ్పీ చైర్మన్ కమల్‌రాజు

చింతకాని, జూలై 10 : గాంధీయిజం ఒక జీవనమార్గమని, జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు అభినంధనీయమైన అంశమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలం కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి, జాతిపిత గాంధీజీ విగ్రహాలను బుధవాదం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాదాతలైన కిలారు జగన్మోహన్‌రావు, సరోజని దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినంధించారు. మండల రైతుసమన్వయ సమితి కన్వీనర్ కిలారు మనోహర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింసవావాదంతో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఘనుడు గాంధీ మాత్రమేనని ఆయన కొనియాడారు. దేశానికి జాతిపిత బాపూజీ గాంధీ అయితే, తెలంగాణ జాతిపిత రాష్ట్ర సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. జడ్పీ నిధుల ద్వారా అత్యధిక నిధుల బదలాయింపు ప్రభుత్వ విద్యకు కేటాయిస్తానని హమీ ఇచ్చారు. పాఠశాలల్లో జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు వలన విద్యార్థులో జాతీయభావం, మహనీయుల చరిత్ర, సందేశాలను ప్రతిరోజు భౌతికంగా అందించినవారమవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతుసమన్వయ సమితి కన్వీనర్ కిలారు మనోహర్, వేణుగోపాల్, భాస్కర్‌రావు, బాబూరావు, పొనుగోటి రత్నాకర్, పఠాన్ షబ్బీర్‌ఖాన్, టీఆర్‌ఎస్ పార్టీమండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్సగాని తిరుపతి కిశోర్, బోయినపల్లి క్రిష్ణమూర్తి, మండల నాయకులు మంకెన రమేశ్, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, చల్లా అచ్చయ్య, షేక్ బడేసాహెబ్, నారపోగు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు కన్నెబోయిన కుటుటంబరావు, దమ్మాలపాటి శ్రీదేవి, తుడుం రాజేశ్, తిరుపతి కోండలు, ఎంపీటీసీలు ఎం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మధిర మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం
మధిర, నమస్తేతెలంగాణ : మధిర మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో 10వ వార్డులో బుధవారం పాదయాత్ర నిర్వహించి వార్డుల్లోని సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిర అభివృద్ధే తన ధ్యేయమని, మధిర మున్సిపాలిటిలో సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు కల్యాణలక్ష్మి, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు, రైతుబంధు, బీమా వంటి పథకాలు టీఆర్‌ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు, నాయకులు పుచ్చకాయల వెంకటనారాయణ, ఏఎంసీ వైస్‌చైర్మన్ శీలం రామ్మోహన్‌రెడ్డి, వేల్పుల శ్రీనివాసరావు(బుజ్జి), మాజీకౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, మొండితోక సుధాకర్, బిక్కి కృష్ణప్రసాద్, రమేష్, గుగులోతు కృష్ణ పాల్గొన్నారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles