స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు

Sun,July 14, 2019 12:45 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ బలోపేతానికి దోహదపడుతున్న ప్రతి కార్యకర్త సైనికుడితో సమానమని పార్టీ నాయకులు అన్నారు.. శనివారం నగరంలోని 16వ డివిజన్‌లో కార్పొరేటర్ కమర్తపు మురళీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం,వైరా ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పాపాలాల్, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధీర్ఘకాలంగా పార్టీకి వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడ్డ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. సభ్యత్వ నమోదుపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా అడిగి సభ్యత్వాలు తీసుకుంటు న్నారని, గత సారి కంటే ఈ దఫా ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ప్రతి డివిజన్‌లో విస్తృతంగా సభ్యత్వాలు జరుగుతున్నాయని అన్నారు. అనేక పథకాలు, అనేక సంస్కరణలు చేసి పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండా తీసుకుని పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉన్నారని, ఉద్యమం నుంచి ప్రభు త్వం ఏర్పా టు వరకు వరుసగా సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు నేరుగా ప్రజలకే అందిస్తున్న తీరును ప్రజలు గమనించారని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుని తమ గుండెలకు హత్తుకున్నారని, అందుకే రెండో సారి కూడా అధికారాన్ని కట్టబెట్టారన్నారు.

ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముఖలాంటి వాడన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా రాజీలేని పోరాటాలకు టీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే గత ఎడాది ప్రమాద బీమాను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఏదైన ప్రమాదం సంభవించి ఆయా కార్యకర్త మృతి చెందితే వారి కుటుంబానికి రూ. 2 లక్షలు అందిస్తుందని, ఇప్పటికే నియోజకవర్గంలో అనేక మందికి ప్రమాద బీమా ను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్ కమర్తపు మురళీ,నాయకులు రెహమాన్, తాజ్‌ఉద్దిన్, నాగరాజు, ఎస్ సురేష్, ఉపేందర్, రామారావు, వీరన్న, వెంకన్న, మౌలానా, మనోహర్, అస్లాం, కోటి, ముఖ్తార్ తది తరులున్నారు.

224
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles