ఎన్నికల వరకే రాజకీయాలు..

Mon,July 15, 2019 01:08 AM

-నిత్యం అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే సండ్ర
కల్లూరు, జూలై 14: ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పడమట తోకవరం, పుల్లయ్య బంజరలో రూ.10 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలో ముందుంచాలన్నదే తన ధ్యేయమన్నారు. ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను తెలుసుకుంటూనే ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో పనులు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వలసాల జయలక్ష్మి, బీరవెల్లి రఘు, జిల్లా, మండల రైతు సమన్వయ సభ్యులు పసుమర్తి చందర్‌రావు, లక్కినేని రఘు, మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, సర్పంచ్‌లు కల్యాణపు కొండలరావు, పెద్దబోయిన కృష్ణవేణి, ఎంపీటీసీలు భురి భవాని, బాలు, ఆత్మ చైర్మన్‌ కట్టా అజయ్‌బాబు, కో-అప్షన్‌ సభ్యులు ఎండీ ఇస్మాయిల్‌, షేక్‌ కమ్లీ, పెద్దబోయిన మల్లేశ్వరరావు, నారాయణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోగోలు లక్ష్మణ్‌రావు, బాలు, కిరణ్‌, పీఆర్‌ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles