గ్రామగ్రామాన గులాబీ పండుగ

Mon,July 15, 2019 01:09 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ :తెలంగాణ రాష్ట్ర స మితి సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తం గా ముమ్మరంగా కొనసాగుతుంది. గ్రామాగ్రామాన గులాబీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలను చేర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతీ ఒక్కరూ టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా కదిలివస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు సభ్యత్వ నమోదులో నిమగ్నమైన్నారు. ఆ యా నియోజకవర్గాలకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రతి రోజు ఆయా నియోజకవర్గాలలోని మండలాలో నమోదు అవుతున్న సభ్యత్వ వివరాలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ఇన్‌చార్జి, శాసన మండలి విప్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి, మధిర, వైరా నియోజకవర్గాల ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధులు, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డిలు ప్రతి రోజు ఉదయం సభ్యత్వ నమోదుపై ఆయా మండల డివిజన్‌ నాయకులతో ఫోన్‌లో మాట్లాడుతూ సభ్యత్వ నమోదును వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రతి రోజు ఖమ్మం నగరంలో పలు డివిజన్‌లలో పర్యటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

రెండు రోజులుగా ఎమ్మెల్యే అజయ్‌తో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా సభ్యత్వ నమోదులో భాగస్వాములయ్యారు. అదేవిధంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రతి రోజు నియోజకవర్గంలో మండలాల్లో పర్యటిస్తు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, సత్తుపల్లి ఎ మ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు వారి వారి నియోజకవర్గాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తుండగా మధిర నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజులు సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత రెండు రోజులుగా మధిర, సత్తుపల్లి, పాలేరు, వైరా నియోజకవర్గాలలోని పలు గ్రామాలలో కొనసాగుతున్న సభ్య త్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని తల్లంపా డు, కొక్కిరేణి, నేలకొండపల్లి, రాజేష్‌పురం గ్రామాలలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధులు ముఖ్య అతిథులుగా పాల్గొని సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయడం లేద ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా మం డ లాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు అ ధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని జూబ్లీక్లబ్‌, లెనిన్‌ నగర్‌లో జరిగిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సభ్యత్వ నమోదును నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రా మంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో జరిగిన సభ్యత్వ నమోదులో ఎస్సి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి పాల్గొన్నారు. సత్తుపల్లిలో జరిగిన సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles