కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

Mon,July 15, 2019 01:09 AM

నేలకొండపల్లి: టీఆర్‌ఎస్‌ సభ్య త్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన పండుగలా నిర్వహించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి సభ్యత్వాన్ని అందించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉ పేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటి సభ్యత్వాన్ని సర్పంచ్‌ దండా పుల్లయ్యకు ఎంపీ నామా నాగేశ్వరరావు అందజేశారు. పార్టీ అన్ని వేళల నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని మించిన పార్టీ మరోకటి లేదని, టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జడ్పీ చైర్‌పర్సన్‌ వాసుదేవరావు, సీడీసీ చైర్మన్‌ జూకూరి గోపాలరావు, నియోజకవర్గ నాయకులు స్వర్ణకుమారి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మీ, ఎంపీపీ వజ్జా రమ్య, పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూసల సీతరాములు, ప్రధానకార్యదర్శి కోటి సైదారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు ఉన్నం బ్రహ్మయ్య, శాకమూరి రమేష్‌, సర్పంచ్‌లు దండా పుల్లయ్య, రమేష్‌, రాంబాయి, సతీష్‌, డిసిసిబి మాజీ డైరెక్టర్‌ నంబూరి సత్యనారాయణ, నెల్లూరి భద్రయ్య, నల్లాని మల్లికార్జున్‌రావు, మైసా శంకర్‌, చింతనిప్పు సైదులు, దండా రంగయ్య, బోనగిరి కిరణ్‌, తన్నీరు కృష్ణమూర్తి, పోలంపల్లి ఉపేందర్‌, వాసు, యర్రబోయిన నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles