టిక్-టాక్ వీడియోలు చేసిన ఉద్యోగులపై చర్యలు

Wed,July 17, 2019 03:58 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తు టిక్-టాక్ వీడియోలు చేసిన పదకొండు మంది సిబ్బందిపై నగరపాలక సంస్థ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. చర్యలో భాగంగా వారిని శానిటేషన్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు కమిషనర్ జే శ్రీనివాస్‌రావు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. శాఖపరమైన అంతర్గత క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందే కానీ విధుల నుంచి తొలగిస్తూ వస్తున్న వార్తలు అవాస్తవాలని ఆయన నమస్తే తెలంగాణకు తెలిపారు. ఉద్యోగుల వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. డేటా ఎంట్రీ అపరేటర్లు, ఇతర ఉద్యోగులను శానిటేషన్ విభాగానికి బదిలీ చేశామన్నారు. అటెండర్‌లను ఫీల్డ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. 11 మంది సిబ్బంది వేతనాల నుంచి 10 రోజుల వేతనాలలో కోత విధించినట్లు వివరించారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉద్యోగాలలోంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఇతర విభాగాలకు బదిలీ అయిన సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. పీ రవి, సురేశ్ (సిస్టమ్ అసిస్టెంట్లు), రాజశేఖర్ (అసోసియేట్), టీ ప్రవీణ్‌కుమార్, ఎల్ ఉపేందర్, ఎన్ శంకర్, పీ అనిత (డేటా ఎంట్రీ అపరేటర్లు), వీరన్న, వంశీ, జీ జ్యోతి, వీ శ్రీదేవి (కార్యాలయ సహయకులు)లను బదిలీ చేసినట్లు వివరించారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles