టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడాలి

Thu,July 18, 2019 03:37 AM

- మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం వార్డులు కైవసం చేసుకోవాలి
- రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే

వైరా నమస్తేతెలంగాణ : వైరా మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరంలో మంగళవారం రాత్రి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో సోమవరం(వైరా) మేజర్ పంచాయతీ వైరా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందని చెప్పారు. వైరా అభివృద్ధికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషితో కేటీఆర్ రూ.20 కోట్లు నిధులు మంజూరు చేశారని వివరించారు. మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. ప్రధానం వైరా మున్సిపాలిటీ ఏర్పాటు, అభివృద్ధి పనులను చేట్టేందుకు విడుదలైన రూ.20 కోట్లతో చేపట్టబోయే పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం సోమవరం గ్రామంలోని ప్రజలకు ఎమ్మెల్యే రాములునాయక్ టీఆర్‌ఎస్ సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బొర్రా రాజశేఖర్, మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్, పఠాన్ సైదాఖాన్, కొల్లి నరసింహరావు, షేక్ నాగుల్‌మీరా, కొల్లి రమేష్, సామినేని శ్రీనివాసరావు, కంసాని బాబు, దురిశెట్టి వెంకటేశ్వర్లు, యలమందల శ్రీను, గొల్లపూడి వెంకట్రావు, ఆవుల వరదయ్య పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles