అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

Thu,July 18, 2019 03:38 AM

- ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అండ
- రాష్ర్టాభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయం
- ఎమ్మెల్యే సండ్ర, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నరేశ్ రెడ్డి
- ముమ్మరంగా సభ్యత్వాల నమోదు : మువ్వా విజయ్‌బాబు

వేంసూరు : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రతి కుటుంబానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులతో కలిసి ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలో ఇటీవల మృతి చెందిన కంచెపోగు కృష్ణయ్య, రావూరి వెంకటేశ్వరరావు కుటుంబాలను పరామర్శించి వారికి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన కోటమర్తి బాలస్వామిని పరామర్శించారు. బీరాపల్లిలో ఇటీవల ఎస్‌ఐ ఫలితాల్లో ఎంపికైన రావూరి కిషోర్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అనంతరం అదే గ్రామంలో ఇటీవల వివాహమైన బంకా చిట్టెయ్య కూతురు దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. గ్రామానికి చెందిన పుచ్చకాయల సందీప్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతూ ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అదే విధంగా కుంచపర్తి గ్రామానికి చెందిన కంచర్ల శివకృష్ణ, ఆరెంపుల రవిచంద్రలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సత్తుపల్లిలో కేటీఆర్ బహిరంగసభకు వచ్చి తిరుగు ప్రయాణంలో వేంసూరు మండలంలోని రాయుడుపాలెం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబాలకు ఆనాడు కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేశారు. అదే గ్రామానికి చెందిన మద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇటీవల కరెంట్ షాక్‌కు గురై చికిత్స పొందుతుండగా ఆయనకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రూ.3లక్షలు, ఎమ్మెల్యే ద్వారా రూ.6లక్షలు సీఎం సహాయనిధి నుంచి అందజేశారు. అనంతరం కుంచపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల సారథ్యంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

రాష్ర్టాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : నూకల
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి అన్నారు. కుంచపర్తిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల సారథ్యంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా, దేశానికే మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. సభ్యత్వాల నమోదులో ఇప్పటికే ఊహించని విధంగా నమోదు చేపట్టడం జరిగిందన్నారు.

ముమ్మరంగా సభ్యత్వాల నమోదు : మువ్వా
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం జరిగిందని డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. కుంచపర్తిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడంతో పాటు రైతు కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మోటపోతుల జగన్నాథం, రైసస మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్‌రావు, నూతన ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, గాదె శ్రీనివాసరావు, దొడ్డా చెన్నకేశవ రెడ్డి, రావూరి శ్రీను, బండి వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్, రాంబాబు, బాపూజీ, కంటే సత్యనారాయణ, నాగేశ్వరరావు, కొప్పుల సత్యనారాయణ రెడ్డి, యర్రా రమేష్, పొన్నంపల్లి దానియేలు, కొరకొప్పుల రవి, వెంకటేశ్వరరావు, మద్దిరెడ్డి పుల్లారెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, రంగారెడ్డి, మర్లపాడు, కుంచపర్తి, కేజీ మల్లేలల సర్పంచ్‌లు మందపాటి వేణుగోపాల్ రెడ్డి, కొరకొప్పుల వెంకటేశ్వరరావు, పోట్రు అనంతరామయ్య, సొసైటీ చైర్మన్ గడిపర్తి రాంబాబు, ఎంపీటీసీలు కిన్నెర జమలమ్మ, నున్నా రాంబాబు పాల్గొన్నారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles