రామాలయంలో ప్రత్యేక పూజలు

Fri,July 19, 2019 03:10 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ జూలై18: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం తదితర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజ నేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్య స్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles