కిష్టారం ఓసీకి జీఎం భూమిపూజ

Fri,July 19, 2019 03:12 AM

సత్తుపల్లిటౌన్, జూలై 18 : కిష్టారం, అటవీ ప్రాంతం జగన్నాథపురంలో ఈ ఓసీ పనులు త్వరలోనే చేపడతామని కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.నరసింహరావు, జేవీఆర్ ఓసీ పీవో బీ.సంజీవరెడ్డి, ఎస్‌ఓ టు జీఎం నారాయణరావులు తెలిపారు. మండల పరిధి కిష్టారం అటవీ ప్రాంతంలో సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించే కిష్టారం ఓసీకి గురువారం భూమిపూజ అనంతరం ఓసీకి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఓసీ పరిధిలో 285.44 హెక్టార్ల అటవీ భూమి, 150.24 హెక్టార్లు ప్రైవేట్ భూమిలో ప్రారంభించారు. క్వారీ ఏరియా 228.2 హెక్టార్లు, డంప్ ఏరియా 157.98హెక్టార్లలో పనులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరీయా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్,ఏరియా మేనేజర్ దామోదర్‌రావు, డీజీఎం పర్సనల్ సామేలు సుధాకర్, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నష్టపరిహారం చెల్లించి పనులు ప్రారంభించండి..జీఎంకు భూ నిర్వాసితుల వినతి
జగన్నాథపురం గ్రామంలో కిష్టారం ఓసీ కోసం భూసేకరణ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే ఓసీ పనులు ప్రారంభిస్తున్నారని, తమకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెల్లించిన అనంతరం పనులు చేపట్టాలని కోరుతూ జగన్నాథపురం రైతులు గురువారం కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ గ్రామంలో భూములు కొనాలాన్నా ఎకరా రూ.20నుంచి రూ.25 లక్షల వరకు ఉందని, కానీ తమ గ్రామంలో రూ.16.50 లక్షలు మాత్రమే నష్ట పరిహారం కింద చెల్లిస్తామన్నారని, గిరిజన గ్రామంలో ఉంటున్న తమకు 5కుంటల ఇండ్ల స్థలం, మౌలిక వసతులు కల్పించాలన్నారు. తొలుత ఓసీ ప్రారంభ సమయంలో రైతులు నల్లబ్యాడ్జీటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి కృష్ణయ్య, రాఇ నాగేశ్వరరావు, నాగేషు, శ్రీనివాసరావు, నరసింహరావు, రామకృష్ణ, షేక్ యాకూబ్, సూర్యనారాయణ, నాగిరెడ్డి, ధనుంజయరావు, అర్జున్, గడ్డం పెద్ద వెంకటేశ్వర్లు, ఊకే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

184
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles