లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ కొరడా

Fri,July 19, 2019 03:12 AM

మధిర, నమస్తేతెలంగాణ: గత నగర పంచాయతీ ఎ న్నికల్లో పోటీచేసి ఖర్చులు తెలపని అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సదరు అభ్యర్థులు పోటీచేయరాదని, వారి నుంచి నామినేషన్ స్వీకరించరాదంటూ మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీచేసింది. 2014 మధిర నగర పంచాయతీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి కటుకూరి సందీప్, 7వ వార్డు నుంచి తాళ్లూరి సీతమ్మ, కొండ్రు ఆదమ్మ, 9వ వార్డు నుంచి వేల్పుల తిరుపతమ్మ, 10వ వార్డు నుంచి ఊట్ల చిన్నకృష్ణమూర్తి, చలువాది నరసింహారావు, 15వ వార్డు నుంచి నాళ్ల శ్రీధర్, 18వ వార్డు నుంచి పిల్లి రమేష్‌బాబులు గత నగర పంచాయతీ ఎన్నికల్లో తమ ఖర్చుల వివరాలు తెలియజేయకపోవడంతో వారిని 2019 మున్సిపల్ ఎన్నికలకు పోటీచేసేందుకు అనర్హులుగా ప్రభుత్వం ప్రక టించింది. జూన్ 28, 2020 వరకు వీరిపై అనర్హత వేటు కొనసాగుతుంది.

సత్తుపల్లి: సత్తుపల్లి మున్పిపాలిటీకి 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 10 మంది ఎన్నికల అధికారులకు లెక్కలు చూపలేదు. దీంతో ఎన్నికల సంఘం ఇటువంటి అభ్యర్థులు తిరిగి ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేకుండా అనర్హతా వేటు వేసింది. 20 వార్డులకుగాను నిర్వహించిన ఎన్నికల్లో పలుపార్టీలతో పాటు స్వతంత్రులుగా పోటీచేసిన ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారపర్వం ప్రారంభం నాటి నుంచి ముగింపు రోజు వరకు వెచ్చించిన ఖర్చు నియమావళి మేరకు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంది. అయితే పలువార్డులకు పోటీచేసిన 10 మంది అభ్యర్థులు ఎటువంటి ఎన్నికల ఖర్చు చూపకపోవటంతో ఈ సారి జరగనున్న ఎన్నికల్లో వారికి పోటీచేసే అవకాశం లేకుండా పోయింది.
అనర్హత వేటు పడిన వారి వివరాలు: గాయం అన్నసూర్య 1 వ నెంబర్ వార్డు, మున్వర్ హుస్సేన్ 6 వార్డు, గడిపల్లి రమేష్ 8 వార్డు, తోట వెంకటరంగారావు 8 వార్డు, కంభంపాటి శ్రీనివాసరావు 10 వార్డు, బ్యాంక్ రాములు 13 వార్డు, దాసరి అన్నసూర్య 16 వార్డు, సిరిగిరి సాయి 17 వార్డు, గోళ్ళ పద్మ 18 వార్డు, గామాసు జయమ్మ 19 వార్డుకు పోటీచేసి ఉన్నారు. అయితే ఈ పదిమందిలో ఏఒక్కరూ లెక్కలు చూపించకపోవడంతో పాటు వీరందరూ ఓటమి పాలవ్వటం విశేషం. వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా వీరు పోటీ చేసే అర్హత కోల్పోయారు. ఈ సారి పోటీచేసే అభ్యర్థులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకుంటే మంచిది.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles